11 April, 2026 | 4:25 AM

రామారంలో రైస్‌మిల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి

11-04-2026 02:27 AM

1100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం

గజ్వేల్, ఏప్రిల్ 10: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం గ్రామంలోని శ్రీ సాయి మహాదేవ రైస్ మ్పి శుక్రవారం సివిల్ సప్లై, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీమ్2 సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో 1100 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

అదే సమయంలో రైస్ మిల్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్న ఒక వాహనాన్ని అదుపులోకి తీసుకుని, అందులో కూడా పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. విచారణలో డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం,  బియ్యం శ్రీ బచ్చు రత్నాకర్కు సంబంధించినదిగా, అమ్మకానికి ఈ రైస్ మిల్కు తరలిస్తున్నట్లుగా వెల్లడైంది. డ్రైవర్ ద్వారా రైస్ మిల్లర్ను ఫోన్లో సంప్రదించగా అతనిని బచ్చు రత్నాకర్గా గుర్తించి, పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పందించకపోవడంతో ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత రైస్ మిల్ల్ప గతంలో కూడా పీడీఎస్ బియ్యం మళ్లింపు కేసులు సహా ఇతర క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కారణంగా ఈ రైస్ మిల్ను గతంలోనే ధాన్యం కొనుగోలు,  కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాల నుంచి బ్లాక్లిస్ట్ చేసినట్లు వెల్లడించారు. పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న 1100 క్వింటాళ్ల బియ్యాన్ని తొగుట, మిరుదొడ్డి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు భద్రపరిచేందుకు తరలించారు. ఈ ఘటనపై రాయపోల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తెలంగాణ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2016,  తెలంగాణ కస్టమ్ మిల్లింగ్ ఆర్డర్ 2015 ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు డి.ఎస్.ఓ తనుజ తెలిపారు.