18 March, 2026 | 8:39 AM

భారీ నష్టాల నుంచి లాభాల్లోకి టాటా స్టీల్

07-11-2024 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 6: టాటా గ్రూప్ ఉక్కు ఉత్పత్తి కంపెనీ టాటా స్టీల్ ఈ సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో రూ. 759 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిరుడు ఇదేకాలంలో రూ.6,511 కోట్ల నికరనష్టాన్ని చవిచూసిన కంపెనీ తాజా త్రైమాసికంలో వ్యయాల్ని తగ్గించుకోవడం ద్వారా టర్న్ ఎరౌండ్ సాధించింది. అయితే టాటా స్టీల్ ఆదాయం మాత్రం ఈ క్యూ2లో రూ. 55,910 కోట్ల నుంచి రూ. 54,503 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 55,853 కోట్ల నుంచి రూ. 52,331 కోట్లకు దిగివచ్చాయి.