28-10-2025 12:10:18 AM
యూనియన్ ఉపాధ్యక్షులు నాగేల్లి
మణుగూరు, అక్టోబర్ 27,(విజయక్రాంతి):కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యే యంగా ముందుకు సాగుతున్నామని, టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షులు నాగేల్లి వెంకటే శ్వర్లు పేర్కొన్నారు. ఇందుకోసం తమ సం ఘం ఎప్పటికీ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.ఏరియాలో నూతనంగా ఏర్పాటైన ఓసీ 2 సైట్ ఆఫీస్ ను గురువారం సందర్శించా రు.షావల్స్ డీల్స్ సెక్షన్, డోజర్ సెక్షన్, ఎలక్ట్రికల్ సెక్షన్, మెయింటెనెన్స్ సెక్షన్ లలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలు సుకున్నారు.
కార్మికులు సమస్యలను తక్షణ ప రిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా నాగేల్లి మాట్లాడుతూ, సమస్యల పరిష్కారంతోనే రెట్టింపు ఉత్సాహంతో కార్మికులు సం స్థ ప్రగతి కోసం పాటుపడతారనితెలిపారు. సింగరేణిలో అనేక హక్కులు సాధిం చిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ సర్కారు సహ కారంతో గు ర్తింపు సంఘంగా సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు అనేక హక్కులు సాధించా మన్నారు.
దశాబ్దాల క్రితం రద్దయిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని కారుణ్య నియామకాల పేరిట తిరిగి పున రుద్ధరించిన ఘనత తమ యూనియన్దే నని తెలిపారు. యూనియన్ నాయ కులు, కార్యకర్తలు కార్మికుల సమస్యలు పరి ష్కా రానికి కృషి చేయాలని కోరారు. నాయకులు బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు, మస్తాన్, రాజ్ కుమార్, ము కేశ్ కుమార్, సర్వే నరేష్, వేముల నవీన్, గుగులోత్ రమేష్ నాయక్ పాల్గొన్నారు.