28-10-2025 12:08:44 AM
- వాన పడితే బురదమయం.. ఎండ కొడితే దుమ్ము ధూళిమయం..
- ఈ రోడ్డుపై ప్రయాణం చేసేదెలా..?
- నత్తనడకన రోడ్డు నిర్మాణపు పనులు
- దుమ్ము, దూలితో వాహనదారులు, ప్రజ ల ఇబ్బందులు
- త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్
మణుగూరు, అక్టోబర్ 27,( విజయక్రాంతి):పట్టణ సుందరీకరణ పనులలో భాగంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్, నుండి సాయిబాబా గుడి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పను లు నత్తనడకన కొనసాగుతున్నాయి. నెలలు గడిస్తున్నా కేవలం కిలోమీటర్ మేర పనులు పూర్తిచేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనులు మందకొడి సాగుతుండటంతో ప్రజలు దు మ్ములో ఉండాల్సి వస్తుంది. రోడ్డుపై వాహ నాలు తిరిగే సమయంలో ఎదురుగా ఉన్న చిన్న చిన్న వాహనాలు దుమ్ముకు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు, ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. రోడ్డు విస్తరణ పనులపై విజయ క్రాంతి కథనం..
వాన పడితే బురదమయం.. ఎండ కొడితే దుమ్ము ధూళిమయం..
రోడ్డు నిర్మాణం చేస్తామంటూ బాగున్న రోడ్డును తవ్వేసి.. నిర్లక్ష్యంగా వదిలేయ డం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయమై ప్రమా దకరంగా మారిన రోడ్డును బాగు చేసేందు కు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. అధికారులు కొత్త రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో కాంట్రాక్టర్ ఉన్న రో డ్డును తవ్వేసి నిర్లక్ష్యంగా వదిలే శారు. రహదారి పై రాత్రి, పగళ్ళు తేడా లేకుండా నిత్యం వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. రోడ్డు పై కంకర అధికంగా తేలి ఉండడం ద్వారా ప్రయాణికులకు తప్పని తిప్పలుగ మారింది. ఎండ కొడితే దుమ్ము ధూళితో నిండిపోయి ఊపిరి తీసుకోవడ మే కష్టమవుతోంది. రో డ్డు విస్తరణ నిర్మా ణ పనులు నత్తనడకన సా గుతుండటం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుఎదు ర్కొంటున్నారు. సాయిబాబా గూడిఏరియాలో వానపడితే వాగును తలపించే లా రహదారి కనిపిస్తుంది. నెలల త రబడి రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడం జరిగింది. తిరిగి విస్తరణ పనులను చేప ట్టకపోవడంతో వర్షం పడితే బురదమ యమై వాహనదారులు జారిపడి ప్రమాదాల బారినపడు తున్నారు. ఎండ అయితే దుమ్ము ధూళి తో ప్రయాణం అసహనంగా మారుతున్నాయి.
ఈ రోడ్డుపై ప్రయాణం చేసేదెలా..?
రోజూ ఉద్యోగాలకు, స్కూలుకు వెళ్ళేటప్పుడు వాహనం నడపడం సవాలుగా మా రింది. పిల్లలను స్కూల్కి తీసుకెళ్లడం కూడా కష్టమవుతోందని స్థానిక ప్రయాణికులు చె బుతున్నారు. ఈ రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో సామా న్యులకు ఇబ్బందులు తప్పడంలేదు. రోడ్డు కంకర, డస్ట్ వేసి వదిలివేయడంతో ఆ మార్గం గుండా వెళ్లేవారికి నరకం కనబడుతుంది. రోడ్లపై వ్యాపా రం చేసుకునే చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు వెంట ఉండ టం దుమ్ము ధూళి అంతా తినుబండారాలపై పడుతుండటంతో వ్యాపారులు వ్యాపా రం కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు వాహనదారులు కూడా తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకరతేలిన రోడ్డుపై ప్రయాణించాలంటే నే భయమేస్తుందని వాహనదారులు వాపోతున్నారు. వెంటనే రోడ్డును పూర్తి చేసి ప్రజల కష్టాలను తీర్చాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్
ఆ రహదారిపై వెళ్ళాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుం దం టూ స్థానిక ప్రజలు అధికారుల పై మండి పడుతున్నారు. రోడ్డు పై ప్రయాణం చేస్తున్న తరుణంలో అదుపు తప్పి గాయల పాలవుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్విగాలి కి వదిలేసిన అధికారుల తీరుపై ప్రయాణి కులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజల నిత్యజీవనానికి కీలకమైన ఈ రహదారి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని, ప్రజల ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత ఆర్ అండ్ బి అధికారిని వివరణ కోసం విజయక్రాంతి సంప్రదించగా ఆయన అందుబా టులో లేదు.
కళ్లు పాడవుతున్నాయి
ఈ మార్గం నుంచి నిత్యం ద్విచక్ర వాహనంపై వెళ్తుంటాను. రోడ్డు పనులు పూర్తి కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందుల ను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోడ్డుపై ఉ న్న దుమ్మంతా కళ్లలో పడుతుంది. దీం తో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తి చేయించాలి.
జావిద్ పాషా , మండల మాజీ కోఆప్షన్ సభ్యులు