టీసీఏ మహిళల క్రికెట్ లీగ్ షురూ

17-09-2026 | 05:15am

రంగారెడ్డి, సెప్టెంబర్ 16:  మహిళా క్రికెట్ ప్రతిభ(Women cricket talent)కు మరింత విస్తృతమైన పోటీ వేదికను కల్పించే లక్ష్యంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) నిర్వహిస్తున్న  టీసీఏ మహిళల రాష్ట్ర క్రికెట్ లీగ్ 2026 టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌(TKR College of Engineering)లో ఉత్సాహభరితంగా ప్రా రంభమైంది. తొలిరోజే మ్యాచ్ లు హోరాహోరీగా సాగాయి. టీసీఏ పర్పుల్ పీకాక్స్,  టీసీఏ రాయల్ ఫాల్కన్స్(TCA Royal Falcons) విజయాలతో లీగ్ కు శుభారంభం లభించింది. మహిళా క్రికెటర్లలో కనిపించిన ఉత్సాహం లీగ్‌కు మంచి స్పందనను ప్రతిబింబించింది. తొలి మ్యాచ్ లో టీసీఏ గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 122 పరుగులు చేసింది. మీషా షారన్ జాకబ్ 38, టీ. అపూర్వ 23 పరుగులతో రాణించారు.

లక్ష్య ఛేదనలో టీసీఏ ప ర్పుల్ పీకాక్స్ 17.3 ఓవర్లలో 5 వికెట్లకు 123 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజ యం సాధించింది. శ్రీజ్ఞ వనమాల 23 పరుగులతో  ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికైం ది. రెండో మ్యాచ్ లో టీసీఏ రాయల్ ఫాల్కన్స్ 15 ఓవర్లలో 4 వికెట్లకు 84 రన్స్ చేయగా, సున్నం తుషార రేఖ 28 పరుగులతో రాణించింది. టీసీఏ ఫీనిక్స్ రైజర్స్ 15 ఓవర్లలో 8 వికెట్లకు 82 పరుగులు చేసి 2 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.

మరిన్ని వార్తలు