calender_icon.png 18 October, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

16-10-2025 12:00:00 AM

కల్వకుర్తి రూరల్ అక్టోబర్15: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ గురుకుల పాఠశాలలో విద్యార్థులే వంట వర్కర్లుగా మారడాన్ని బీఆర్‌ఎస్వీ కల్వకుర్తి అధ్యక్షుడు దారమోని గణేష్ తీ వ్రంగా ఖండించారు. బుధవారం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.

వంట కార్మికులు తమ న్యాయ బద్ధమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. గత కొద్ది నెలలుగా జీతాలు రాక, సీనియారిటీ ప్రకారం జీతాలు పెంచాల్సింది పోయి ఉన్న జీతాలనే తగ్గించడంతో వంట కార్మికులు సమ్మెబాట పట్టారని తెలిపారు.

సమ్మె కారణంగా రెండు రోజులుగా విద్యార్థులకు భోజనం లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారని, మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో కలిసి వంటగదిలో వంట చేసుకుంటూ, తరగతి గదులను వారే శుభ్రం చేసుకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా రు.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి సమస్యలను పరిష్కరించకపోతే, బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుశీల ఈశ్వరయ్య, బీఆర్‌ఎస్వీ నాయకులు శేఖర్ గౌడ్, రవి, కేశవులు, శ్రీరాములు, శరత్, షఫీ తదితరులుపాల్గొన్నారు.