18-07-2025 06:54:27 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు లో ఉన్న ఏకలవ్య కేంద్రీయ బాలికల విద్యాలయంలో బాలిక పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు, తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో శుక్రవారం తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల టీచర్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, గతంలో కూడా అతనిపై ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని, అయినా అతన్ని విధుల్లో కొనసాగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.