4 May, 2026 | 12:29 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

చోరీ చేసిన కొద్దిసేపటికే పోలీసులకు చిక్కిన దొంగలు

18-07-2025 06:59 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): బావి వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ మోటార్లు తరచుగా అపహరణకు గురవుతుండడంతో చెట్టు పైన ఏర్పాటు చేసిన సీసీ కెమెరా తన నాయనమ్మ మెడలో నుంచి అపహరించిన గొలుసు దొంగలను కొద్దిసేపట్లోనే పట్టించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన బొగ్గు వెంకటమ్మ అనే వృద్ధురాలు పొలంలో కలుపు తీసి రోడ్డుపైకి రాగా అప్పుడే అక్కడికి స్కూటీపై వచ్చిన ఇద్దరు అగంతకులు ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. దీనితో బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడికి చేరిన కొందరు వెంటనే ఈ విషయాన్ని వెంకటమ్మ బంధువులకు తెలుపగా ఆమె మనుమడు నందు అక్కడికి చేరుకొని వెంటనే చెట్టు పైన ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ముఖానికి దస్తికట్టుకొని ఉన్న దృశ్యాలు కనిపించాయి.

వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ మురళీధర్ రాజ్ పోలీసులను అప్రమత్తం చేసి పలు రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. సదరు చోరీకి పాల్పడ్డ ఇద్దరు అగంతకులు నెల్లికుదురు మండలం ఆలేరు వైపు వెళ్తుండగా అక్కడ పట్టుకొని ప్రశ్నించడంతో తామే దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించడంతో వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని క్రైమ్ బ్రాంచ్ వారికి అప్పగించి విచారణ జరుపుతున్నారు. విద్యుత్ మోటార్ల దొంగల కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా తన నాయనమ్మ మెడలో గొలుసును కాపాడుకోగలిగినట్లు మనవడు పేర్కొన్నాడు.