calender_icon.png 18 July, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

18-07-2025 06:51:06 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచి అతనికి భరోసానిచ్చారు సాటి స్నేహితులు,కాలనీ వాసులు. తన తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న స్నేహితునికి తామున్నామంటూ ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కిష్టం పార్వతమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించారు.పార్వతమ్మ కుమారుని స్నేహితులు కుటుంబసభ్యులను పరామర్శించి రూ.40,000 ఆర్థిక సాయంగా అందజేసి అండగా తాముంటామని అతనికి ధైర్యం చెప్పారు.