టార్గెట్ సిరీస్
నేడు జింబాబ్వేతో రెండో టీ20
సూపర్ ఫామ్‌లో బౌలర్లు
సమం చేసేందుకు జింబాబ్వే ఆరాటం
వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు విజయాన్ని రుచి చూసిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. జింబాబ్వేతో రెండో టీ20 గెలిచి సారథిగా తొలి సిరీస్ గెలుపును అందుకోవాలని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉవ్విళ్లూరుతున్నాడు. బౌలర్లు, బ్యాటర్లు ఫామ్‌లో ఉన్న వేళ భారత్ గెలుపును అడ్డుకోవడం జింబాబ్వేకు కష్టమే.
హరారే, జూలై 24: జింబాబ్వే పర్యటనను ఘనవిజయంతో ప్రారంభించిన భారత్ మరో పోరుకు సిద్దమైంది. శనివారం హరారే వేదికగా జరిగే రెండో టీ20లో తలపడబోతోంది. తొలి టీ20 తరహాలోనే ఏకపక్ష విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తోంది.
తద్వారా చివరి మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భారత్ భావిస్తోంది. మరోవైపు రెండో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని జింబాబ్వే పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. యువ సంచల నం వైభవ్ సూర్యవంశీ కేవ లం 19 బంతుల్లో 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. తద్వారా ఇంగ్లాండ్ టూర్ వైఫల్యాలకు తెరదించాడు. హరారే పిచ్‌పై గతంలో ఆడిన అనుభవం కూడా వైభవ్‌కు బాగా కలిసొచ్చింది. సూర్యవంశీ ఇదే జోరు కొనసాగిస్తే మరో ఘనవిజయం భారత్ ఖాతాలో పడడం ఖాయం.
అలాగే మరికొన్ని రికార్డులు కూడా వైభవ్ అందుకోవడం కూడా ఖాయమే. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రింకూ సింగ్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అభిషేక్ శర్మ మా త్రం తొలి టీ 20లో దారుణం గా విఫలమయ్యాడు. అత ను సత్తా చాటాల్సి ఉంది. ఇషా న్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లకు అవకాశం దక్కలేదు. తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లో యరార్డర్లో ఆడనున్నారు. మయాంక్ యాదవ్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు.
రెండేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రిన్స్ యా దవ్ కూడా సత్తా చాటాడు. కానీ అశోక్ శర్మ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అతనికి మరో అవకాశం ఇస్తారా లే దా యశ్ ఠాకూర్‌ను ఆడిస్తారా అనేది చూ డాలి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. మరోవైపు జింబాబ్వే కెప్టెన్ సి కందర్ రజాపైనే క్కువగా ఆధారపడుతోంది. మొదటి మ్యాచ్‌లో తక్కు వ స్కోరుకే పరిమితమైన ఆతిథ్య జట్టు, సిరీస్ను కాపాడు కో వాలంటే బ్యాటింగ్‌లో చాలా మెరుగవ్వాల్సి ఉంది.
గత మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు బౌండరీలు కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. బంతి కొత్తగా ఉండి ఎక్కువ స్వింగ్ అయిం ది. వెస్లీ మాధేవెరె (39), తడివానాషే మారుమణి (27) రాణించడంతో జట్టు కనీసం 125 పరుగులైనా చేయగలిగింది. భారత బౌ లర్లు పూర్తి ఫామ్‌లో ఉండడంతో ఈ మ్యాచ్ జింబాబ్వే బ్యాటర్లకు కఠిన పరీక్షగా చెప్పొ చ్చు. సికిందర్ రజాతో పాటు తొలి టీ 20 లో ఆకట్టుకు న్న మథెవెరెపై అంచనాలున్నా యి. అటు బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ము జరబానీ, రిచర్డ్ ఎన్గారవా కీలకం కానున్నా రు.
తుది జట్ల అంచనా
భారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవి బి ష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యా దవ్, అశోక్ శర్మ/యశ్ ఠాకూర్.
జింబాబ్వే : సికందర్ రజా (కెప్టెన్), బ్ర యాన్ బెన్నెట్, బెన్ కర్రన్, డియోన్ మై యర్స్, రియాన్ బర్ల్, మెథెవెరె, మారుమని (వికెట్ కీపర్), ఎవాన్స్, న్యామ్హూరి, ఎనరవ, ముజరబానీ.






