25 July, 2026 | 2:50 AM

ఆసియా క్రీడల క్రికెట్ డ్రా విడుదల

25-07-2026 02:15 AM

వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాక్

నేరుగా క్వార్టర్స్ లోకి ఎంట్రీ

సెమీస్‌లో తలపడే ఛాన్స్

టోక్యో , జూలై 24 : సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ డ్రా విడుదలైంది. పురుషుల, మహిళల రెండు విభాగాల్లో టెస్టు హోదా కలిగిన భారత్, పాకిస్తా న్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. భారత్, పాక్ జ ట్లు వేర్వేరు గ్రూపుల్లో చోటు దక్కించుకున్నాయి.

దీంతో చిరకాల ప్రత్యర్థులు సెమీఫై న ల్లో తలపడే అవకాశాలున్నాయి. క్వార్టర్స్ లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నా రు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి.

లీగ్ దశలో రెండు గ్రూప్ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోను న్నా యి. క్వార్టర్స్‌లో గెలిచిన నాలుగు జట్లు సెమీ స్‌లో తలపడనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది.

మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లే నిర్వహించనుండగా భారత్‌లో జపాన్, థాయ్ లాండ్‌తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేశ్, శ్రీ లంకతో మలేషియా తలపడతాయి. కాగా ఆ సియా గేమ్స్ జపాన్ వేదిక గా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో భారత పు రుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నాయి. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వ గా, అఫ్గానిస్తాన్ రజతం గెలుచుకుంది. హ ర్మన్ప్రీత్ సారథ్యంని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకుంది.