ఇంగ్లండ్‌లో టీమిండియా
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్ విడుదల
లండన్: టీమిండియా వచ్చే ఏడాది జూన్‌లో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఈ మేరకు గురువారం బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) టెస్టు సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఇరుజట్ల మధ్య చివరి సారిగా 2021లో ఇంగ్లండ్ వేదికగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఆ సిరీస్‌ను భారత్, ఇంగ్లండ్‌లు 2 సమం గా పంచుకున్నాయి. ఇక 2025 డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
2025 నుంచి 2027 డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్‌లో ఈ టోర్నీ జరగనుంది. జూన్ 20న మొదలుకానున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆగస్టు 4 వరకు జరగనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. భారత మహిళల జట్టు వచ్చే ఏడాది జూన్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో హర్మన్ సేన ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. 2026లో ఇంగ్లండ్ వెళ్లనున్న భారత్ లార్డ్స్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది.




