కృష్ణా నగర్ మెరిసేనా?
పతకంపై ఆశలు రేపుతున్న పారా షట్లర్ n టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
కృష్ణా నగర్.. ఈ పేరు వింటే హైదరాబాద్ కేంద్రంగా సినిమా కష్టాలు గుర్తుకు రావడం సహజం. కానీ బ్యాడ్మింటన్ పారా షట్లర్
కృష్ణా నగర్ కథలో కష్టాలనే ఇష్టాలుగా
మార్చుకొని పారా అథ్లెట్‌గా ఎదిగిన వైనం
ఆదర్శంగా నిలుస్తోంది. టోక్యో పారాలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి స్వర్ణం కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈసారి పారిస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశిస్తున్న కృష్ణకు ఆల్ ది బెస్ట్..
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి కచ్చితంగా పతకం తీసుకొచ్చే అథ్లెట్లలో కృష్ణా నగర్ ముందు వరుసలో ఉంటాడు. 2017లో బ్యాడ్మింటన్ కెరీర్‌ను ఎంచుకున్న కృష్ణ మూడేళ్ల వ్యవధిలోనే అంతర్జాతీయ స్థాయిలో పారా షట్లర్‌గా మంచి గుర్తింపు సాధించాడు. పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే దేశానికి పతకం తీసుకొచ్చి చరిత్ర సృష్టించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్ కేటగిరిలో కృష్ణా నగర్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
తద్వారా ఆడిన తొలి పారాలింపిక్స్‌లోనే పసిడి పతకం గెలిచిన రెండో భారతీయుడిగా చరిత్రకెక్కాడు. అయితే ఈసారి ప్రమో ద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడడంతో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కృష్ణ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనున్న పారాలింపిక్స్ కోసం భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 82 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.
ఎస్‌హెచ్ కేటగిరీ అంటే..
పారాలింపిక్స్‌లో ఎస్‌హెచ్ 6 కేటగిరీని షార్ట్ స్టేచ్యూర్‌గా అభివర్ణిస్తారు. ఈ కేటగిరీలో పాల్గొనే పారా అథ్లెట్ల ఎత్తు నిర్దిష్ట ప్రమాణాల్లో ఉండాలి. పురుషులు అయితే 145 సెమీ కంటే తక్కువగా.. మహిళలు అయితే 137 సెమీ కంటే తక్కువగా ఉండా లి. ఇక ఎస్‌హెచ్ 6 కేటగిరీలో పోటీ పడుతున్న కృష్ణా నగర్ ఎత్తు.. 4 అడుగుల 6 అంగుళాలు. ఇక రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన కృష్ణా నగర్ 1999లో జన్మించాడు.
చిన్నప్పటి నుంచి కష్టాలు చూసిన కృష్ణ 2017లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బ్యాడ్మింటన్‌లో కెరీర్‌ను ఆరంభించాడు. 2018 పారా ఆసియా గేమ్స్‌లో కాంస్యం గెలవడం ద్వారా కృష్ణ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. 2019 బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ లో డబుల్స్‌లో రజతంతో పాటు సింగిల్స్‌లో కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించాడు. తాజాగా పట్టాయా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచి ఆత్మవిశ్వాసంతో పారిస్‌కు బయల్దేరనున్నాడు.




