విమానంలో సాంకేతిక లోపం
15-05-2024 02:31 AM
గంటపాటు నిలిచిపోయిన ఇండిగో ఫ్లుటై
విమానంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే తెల్లం
రాజేంద్రనగర్, మే 14 (విజయక్రాంతి): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో నెలకొన్న సాంకేతిక లోపంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అధికారుల వివరాల ప్రకారం.. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్‌కు బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు గంటపాటు విమానం రన్‌వేపైనే నిలిచిపోయింది. రన్‌వేపైనే విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణలు ఉన్నారు. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.




