1 April, 2026 | 10:11 AM

లక్ష్యానికి దూరం.. అభివృద్ధికి ఆటంకం

15-05-2024 02:33 AM

మెదక్ జిల్లాలో ఏడు మార్కెట్ కమిటీలు

రూ. 16.49,87 కోట్లకు గాను రూ. 15.68,42 కోట్ల ఆదాయం

వినియోగిస్తేనే మేలంటున్న రైతులు

మెదక్, మే 14 (విజయక్రాంతి) : మెదక్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ) ఆదాయం పెంపొందించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఏఎంసీలు అనుకున్న లక్ష్యం సాధించగా, మరికొన్ని మాత్రం వెనకడుగు వేశాయి. 2023 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యా న్ని కొన్ని చేరుకోలేక పోయాయి. చిన్న ఏఎంసీలు మాత్రం ఎక్కువ ఆదాయం తెచ్చి పెట్టా యి. ముఖ్యంగా ధాన్యం, మొక్కజొన్న, కందులు, పత్తి, పౌరసరఫరాల ధాన్యం కొనుగోళ్లతో ఆదాయం వస్తోంది. జిల్లా వ్యాప్తం గా మెదక్, చేగుంట, నర్సాపూర్, రామాయంపేట, పాపన్నపేట, తూప్రాన్ వ్యవసా య మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో ఒక్కొచోట ఒక్కో విధంగా ఆదాయం సమకూరుతుంది. ధాన్యం, గోదాముల అద్దె తదిత ర రూపాల్లో ఆదాయం వస్తోంది. జిల్లా వ్యాప్తంగా రూ. 16.49,87 కోట్ల ఆదా యం రావాల్సి ఉంది. 

కానీ రూ. 15,68, 42కోట్లు మాత్రమే వచ్చింది. పెద్ద ఏఎంసీలు అయిన మెదక్, నర్సాపూర్, రామాయంపేట, పాపన్నపేట నుంచి ఆదా యం అనుకున్న దానికన్నా తక్కువగా వచ్చింది. చిన్న ఏఎంసీలు అయిన చేగుంట, తూప్రాన్‌లలో కొద్దిగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే.. మెదక్ ఏంఎసీలో 446.06లక్షల ఆదాయం లక్ష్యం కాగా 419.92లక్షలు, నర్సాపూర్ ఏఎంసీలో 338.75లక్షల లక్ష్యానికి 317.87లక్షలు, రామాయంపేట ఏఎంసీ పరిధిలో 275.39లక్షల ఆదాయానికి 241. 11లక్షలు సాధించింది. పాపన్నపేట ఏఎంసీ పరిధిలో 337.32 లక్షలకు గాను 304.42 లక్షలు, చేగుంట ఏఎంసీలో 183.75 లక్షలకు గాను 183.88 లక్షలు, తూప్రాన్ ఏఎంసీ పరిధిలో 68.60 లక్షల ఆదాయానికి గాను 101.22 లక్షలు సాధించింది. 

ఆదాయం వినియోగిస్తే ప్రయోజనం

ఏఎంసీలకు ఏటా వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుతుంది. కానీ వాటిని ఏఎంసీల అవసరాలకు తగిన విధంగా వినియోగించడం లేదు. ఏఎంసీల అభివృద్ధికి వీటిని వాడుకుంటే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చేగుంట ఏఎంసీలో అసంపూర్తిగా కవర్ షెడ్లు ఉన్నాయి. వీటిని పూర్తి చేయాలని గత మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపినా మంజూరు చేయడం లేదు. ఏఎంసీలో ఉన్న రూ. 50లక్షలతో వాటిని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఉన్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. ఇలా జిల్లాలోని ఏడు ఏఎంసీలలో కూడా వినియోగిస్తే మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.