1 April, 2026 | 11:25 AM

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ

01-04-2026 09:56 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో(Moinabad Drugs Case) నిందితులను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నిమిత్ శర్మకు 3 రోజుల కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.ఇప్పటికే ముగ్గురిని మూడు రోజుల పాటు సిట్ అధికారులు(SIT Officials) విచారించారు.

మాదకద్రవ్యాల వినియోగం, పోలీసులపై కాల్పుల కేసులో, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పి. ‘పైలట్’ రోహిత్ రెడ్డి(Pilot Rohith Reddy), ఆయన సోదరుడు, సహ నిందితుడు రితేష్ రెడ్డి, అలాగే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ నమిత్ శర్మల పోలీసు కస్టడీ పిటిషన్‌పై, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టు(Upparpally Court) సోమవారం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.  మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కోసం నిందితుడిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.