బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ
నంగునూరు,(విజయక్రాంతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) నంగునూరు మండలం సిద్ధన్నపేట, దర్గాపల్లి గ్రామాల్లో పలువురు బాధితుల కుటుంబాలను పరామర్శించారు.అనారోగ్యంతో సిద్దిపేట సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధన్నపేట గ్రామ సర్పంచ్ సంగు పురేందర్‌ను పరామర్శించి,ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్త డాకూరి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
నంగునూరు మండలం దర్గాపల్లిలో మై విలేజ్ షో డైరెక్టర్ అనిల్ తండ్రి ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం సిద్ధన్నపేట గ్రామంలో ఇటీవల తండ్రిని కోల్పోయిన పంగ రాజశేఖర్ రెడ్డి, బొల్లు మహేష్ కుటుంబాలను ఓదార్చి సానుభూతి తెలిపారు.ప్రమాదాల్లో గాయపడిన గ్రామ హెల్పర్ లక్ష్మయ్య, తిరుపతి, కంతుల మల్లవ్వ,అనరాజుల పరశరాములు,అనారోగ్యంతో ఉన్న కత్తుల రాజిరెడ్డిని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు.హరీష్ రావు వెంట మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్,సీనియర్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి,రమేష్ గౌడ్,రాగుల సారయ్య తదితరులు ఉన్నారు.




