కంది సాగులో మెళకువలు పాటించాలి
04-06-2024 01:03 AM
జహీరాబాద్, జూన్ 3: కంది సాగులో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పంటల యాజమాన్య శాస్త్రవేత్త రమేశ్ అన్నారు. సోమవారం జహీరాబాద్ మండలంలోని జీడిగడ్డ, ఒంటెల్ గడ్డ, సిద్దాపూర్ తండాల్లో కంది సాగుపై రైతులకు అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. తాండూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం 2021లో టీడీఆర్‌జీ అనే రకం కంది విత్తనాన్ని అభివృద్ధి చేసిందని, ఇది ఎండు తెగుళ్లు, స్టేరిలిటీ మోసా యిక్ వైరస్‌లను తట్టుకుంటుందని తెలిపా రు. ఎండు తెగుళ్ల సమస్య ఉన్న భూమిలో ఈ రకం విత్తనాలతో సాగు చేసుకుంటే మంచిదని తెలిపారు. అనంతరం 105 మంది రైతులకు కంది విత్తనాల ప్యాకెట్లను అందజేశారు.






