17 July, 2026 | 7:11 PM

బీఆర్‌ఎస్ హయాంలోనే ఎల్బీనగర్ అభివృద్ధి

04-06-2024 01:07 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, జూన్ 3: గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమా లతో తెలంగాణ అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనస్థలిపురంలో పర్యటించిన ఆయన ఏరియా దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు.

ఎల్బీనగర్‌లో మెట్రో రైలు, ఫ్లుఓవ ర్లు, కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టామ ని, నాగోల్‌లో నిర్మిస్తున్న ఎస్‌టీపీ ప్లాంట్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిచడానికి మూడు మల్టీస్పెషాలిటీ హస్పిటల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన ఆర్‌ఎంవో కృష్ణ, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సుమన్‌గౌడ్, నర్సింహరావు, మధుగౌడ్, సామ బుచ్చిరెడ్డి రాజు పాల్గొన్నారు.