16 April, 2026 | 2:07 AM

ఫుట్-పాత్ ఆక్రమణలు తొలగింపు

16-04-2026 12:00 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిలో ఫుట్ పాత్ పై వెలసిన ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం తొలగింపజేశారు. నారపల్లి మజీద్ నుండి ఎం.జి.ఆర్  షాపింగ్ మాల్ వరకు గల మేయిన్ రోడ్డుకు ఇరువైపుల గల ఫుట్-పాత్ అక్రమణలను  తొలగించటం జరిగినది.

రోడ్డుకు ఇరువైపుల గల ఫుట్‌ఏపాత్ పై ఉన్నటువంటి షాపు యజమానులు తిరిగి ఆక్రమణ చేసినా, పాదాచారులకు ఎలాంటి ఆటంకములు ఏర్పరచినా, జరిమానా విధించబడుతుందని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి హెచ్చరించారు. షాపు యజమానులు ముందస్తుగా ఆక్రమణలు స్వతహాగా తొలగించుకొనగలరని, లేని పిదప చట్ట ప్రకారము తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమములో టి.పి.ఓ, ఎ.సి.పి రాజీవ్ రెడ్డి, స్థానిక ట్రాఫిక్ పోలీసు శాఖ, స్థానిక పోలీసు శాఖ వారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.