6 May, 2026 | 1:55 AM

సాదా బైనామా, భూభారతి పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి

06-05-2026 12:00 AM

ఘట్‌కేసర్, మే 5 (విజయక్రాంతి) : ఘట్కేసర్ తహసీల్దార్ కార్యాలయంను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కీసర ఆర్డిఓ రాజేష్ కుమార్ తో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సాదా బైనామా, భూ భారతి పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించి పెండెన్సి త్వరితగతిన పూర్తి చేయాలని తహసిల్దారును ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూమి రికార్డుల సమగ్ర పోర్టల్ భూ భారతిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సూచనలు జారీ చేసారు.  పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండెన్సికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామా, భూ భారతి రికార్డులను అదనపు కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ తహాసీల్దార్ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.