4 September, 2026 | 6:06 AM

ఘనంగా ముగిసిన తీజ్ ఉత్సవాలు

04-09-2026 | 04:20am

తీజ్ నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్, కల్కి భగవాన్, సింగర్ బిక్షు నాయక్ 

ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): అశోక్ నగర్ లోని గాంధీ పార్క్ లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించిన తీజ్ ఉత్సవాలు(Teej celebrations) గురువారం నిమజ్జన కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం నుంచే గాంధీనగర్ పార్క్ లోని తీజ్ ప్రాంతంలో సేవాలాల్ మహారాజ్, మేరమ్మ యాడికి ప్రముఖులు  మొక్కులు చెల్లించుకుని ప్రసంగించారు.

మధ్యాహ్నం ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథులు కల్కి భగవాన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సింగర్ భిక్షు నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్గనైజేషన్, తీజ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు శంకర్ నాయక్, కిరణ్ రాథోడ్ లు మాట్లాడుతూ అశోక్ నగర్ లో మొట్ట మొదటి సారిగా తీజ్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

తొమ్మిది రోజులపాటు ఐకమత్యంగా సోదర భావంతో అందరూ కలిసి ఈ పండుగను నిర్వహించడం, బంజారా సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం ఆనందంగా ఉందని వారు తెలియజేసారు. యువతి, యువకులు తీజ్ బుట్టలతో డీజే పాటలపై నృత్యాలు చేసుకుంటూ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్యాంక్ బండ్లో తీజ్ బుట్టలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్ ,కిరణ్ రాథోడ్, ప్రవీణ్ నాయక్, శింబు నాయక్ ,నరేష్, భాస్కర్, నరసింహ, ఆనంద్,ఉమేష్ ,కుమార్, సోమేష్, బాలకోటి, రాకేష్, పవన్ కల్యాణ్, రవి నాయక్, ప్రకాశ్, జగన్,  శ్రీకాంత్ ,శివ,దివ్య, వైష్ణవి, జ్యోతి, నవీన్ పాల్గొన్నారు.