జీపీవోల కమిటీ ఏకగ్రీవం
గౌరవ అధ్యక్షుడిగా తహసీల్దార్ రమేష్ నియామకం..
చిగురుమామిడి (విజయక్రాంతి): మండలంలోని గ్రామ పాలన ఆఫీసర్ల(జీపీవో) సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన కమిటీ సభ్యులను ప్రకటించారు. నూతన కార్యవర్గాన్ని ప్రకటించే ముందు, చిగురుమామిడి తహసీల్దార్ ముద్దసాని రమేష్‌ను సంఘం గౌరవ అధ్యక్షుడిగా, నాయబ్ తహసీల్దార్ తాడ స్వరూపారాణిని గౌరవ సలహాదారుగా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నియమించారు. అనంతరం జీపీవో సంఘం ముఖ్య కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఎన్నికైన వారిలో అధ్యక్షులుగా వూరుగొండ రమేష్ రెడ్డి (చిగురుమామిడి జీపీవో), వ్యవస్థాపక అధ్యక్షులు కొలిపాక బాలయ్య (ఇందుర్తి జీపీవో), ఉపాధ్యక్షులు జీల భూమయ్య (రేకొండ జీపీవో), జనరల్ సెక్రటరీ గోదారి అనిత (సుందరగిరి జీపీవో), ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం అంజయ్య(లంబాడిపల్లి జీపీవో), కోశాధికారి తాటిపల్లి రాములు (బొమ్మనపల్లి జీపీవో) ఎన్నిక కాగా... కార్యవర్గ సభ్యులుగా వరుకోలు శ్రీనివాస్ (నవాబుపేట), పొందుర్తి శ్రీనివాస్ (ఇందుర్తి), తేల్ల బాలరాజు (ముదిమాణిక్యం), ఏనుగు రాజాబాబు (బొమ్మనపల్లి), శ్రీ మహమ్మద్ రఫీ (సుందరగిరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ అభినందించారు. జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడానికి నూతన కమిటీ చురుకుగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.




