10 March, 2026 | 2:55 PM

కలెక్టర్ ఆదేశాలతో ఎరువుల దుకాణాలను సీజ్ చేసిన తహసిల్దార్

09-03-2026 07:22 PM

అధిక ధరకు యూరియా విక్రయిస్తుంది నిజమే..

అధికారుల విచారణలో ఫిర్యాదు చేసిన రైతులు

కొల్చారం,(విజయ క్రాంతి): జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఆదేశాల మేరకు కొల్చారం తాసిల్దార్ శ్రీనివాస చారి, మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి సోమవారం మండలంలోని రంగంపేటలోని అజయ్ కుమార్ ఫర్టిలైజర్స్, సాయిరాం ఫర్టిలైజర్  ఎరువుల దుకాణాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాలలో గత రెండు రోజుల క్రితం యూరియా బస్తా రూ.300లకు ఒకటి విక్రయించినట్లు

కొల్చారం మండలం అప్పాజీపల్లి పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ కు రైతులు ఫిర్యాదు చేయడంతో చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తాసిల్దార్ వ్యవసాయాధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు యూరియా అధిక ధరకు విక్రయించినట్లు రైతులు సైతం అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎరువుల దుకాణాలు మూసి వేస్తున్నట్లు ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాసాచారి తెలిపారు.