17 June, 2026 | 11:35 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

చైన్ స్నాచింగ్ ఘటనలో స్పందించిన టేక్మాల్ పోలీసులు

14-02-2026 12:00 AM

నిందితుల అరెస్ట్, రిమాండ్కు తరలింపు:  టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్

మెదక్, ఫిబ్రవరి 13(విజయ క్రాంతి) : మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన్నట్లు టేక్మాల్ ఎస్‌ఐ  అరవింద్ వెల్లడించారు. వివరాల ప్రకారం తంప్లూర్ గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును అపహరించి అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలు వెంటనే టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సాంకేతిక ఆధారాలు, సమాచార సేకరణ ఆధారంగా నిందితులైన పాపయ్య, పోచయ్య గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన మూడు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచింగ్ ఘటనలు అధికమవుతున్నాయని ఎస్‌ఐ అరవింద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానా స్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.