13 April, 2026 | 9:26 PM

గెలిచిన భార్యాభర్తలు

14-02-2026 12:00 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరూ బి ఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 46వ వార్డు టిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెరిగంటి స్వప్న గెలుపొందారు. ఆమె భర్త 47 వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెరిగంటి లక్ష్మీనారాయణ గెలుపొందారు. ఓకే ఇంటిలోని వారు ఓకే పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందడం కామారెడ్డిలో చర్చ నీ అంశంగా మారింది. భార్యాభర్తలను గెలిపించిన ఓటర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.