calender_icon.png 28 July, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

28-07-2025 08:20:36 AM

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు తెలంగాణ కేబినెట్ భేటీ(Telangana Cabinet meeting) కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్‌ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశంముంది. ఇప్పటికే విద్యుత్‌ సంస్థల్లో అక్రమాలపై ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక  అందింది. మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు నివేదికలపై  ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కులగణపై నిపుణుల కమిటీ నివేదికపై ప్రభుత్వం చర్చించనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచన చేసే అవకాశముంది. గోశాలల నిర్మాణం, గిగ్ వర్కర్ల పాలసీ, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.