28-07-2025 12:41:19 PM
గద్వాల, (విజయక్రాంతి): గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బింబిసారా సినిమా, మాటీవీలో చిన్ని, ముక్కుపుడక టీవీ సీరియల్ లో నటించిన బాలనటి శ్రీదేవి సోమవారం ఆలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. ఉప్పల్లో ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా కుటుంబ సభ్యులతో కలిసి మల్దకల్ రావడం జరిగిందని బాలనాటి తెలిపింది.