calender_icon.png 28 July, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో పడ్డ ఆటో

28-07-2025 12:40:05 PM

  1. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు 
  2. ఒకే కుటుంబానికి చెందిన క్షతగాత్రులు 

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు స్టేజి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆటో బావిలో పడ్డ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆటోలో ప్రయాణిస్తుండగా,  ఈ ఘటనలో శ్రీరాం నరసయ్య (80) మరణించగా ఆటో డ్రైవర్ శ్రీరామ్ మార్కండేయ, శ్రీరామ్ భారతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో భారతమ్మ పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎం తరలించారు. శ్రీరామ్ మార్కండేయను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.