28-07-2025 12:23:39 PM
ఇల్లందు టౌన్, (విజయక్రాంతి): జులై 26, 27వ తేదీలలో అశ్వరావుపేట నియోజకవర్గం(Ashwaraopet Constituency) కేంద్రంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఐ జిల్లా 3వ మహాసభలలో ఇల్లందు(Yellandu) నుండి కే సారయ్య, దేవరకొండ శంకర్, బంధం నాగయ్య జిల్లా కార్యవర్గ సభ్యులుగా, బాస శ్రీనివాస్, ఎండి నజీర్ అహ్మద్, బొప్పిశెట్టి సత్యనారాయణ, మహిళా విభాగం నుండి కమటం చంద్రకళ, యువజన విభాగంలో ఉమాగాని హరీష్ గౌడ్, న్యాయవాదుల విభాగంలో ఎస్. సత్యనారాయణ ను ఎన్నుకున్నట్లు సిపిఐ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఇల్లందు పట్టణ కార్యదర్శి బాస శ్రీనివాసరావు తెలియజేశారు .