28-07-2025 12:26:09 PM
అనంతగిరి: ఆగస్టు మూడున హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్(Nampally Exhibition Ground) లో జరిగే వైశ్య రాజకీయాల రణభేరిని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు వైశ్య సంఘాలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన రణభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైశ్య శక్తి ఐక్యతకు కోదాడ నియోజకవర్గం నుండి రణభేరి సన్నాహక సమావేశాలను మండలాల వారీగా మండల హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అనంతగిరి మోతే నడిగూడెం మునగాల చిలుకూరు మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సోమవారం మేళ్లచెరువు చింతలపాలెం మఠంపల్లి గరిడేపల్లి నేరేడుచర్ల పాలకీడు హుజూర్నగర్ మండలాలలో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈ సమావేశాలకు మండల గ్రామస్థాయి అధ్యక్షులు ప్రముఖ నాయకులు వాసవి క్లబ్ ప్రతినిధులు మహిళా విభాగం నాయకులు వివిధ సంఘాల పెద్దలు నాయకులు హాజరుకావాలని కోరారు. ఆయన వెంట సంఘ నాయకులు ఉన్నారు.