calender_icon.png 28 July, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట రాయుళ్ళు అరెస్టు..

28-07-2025 11:20:06 AM

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్టు..

హుజూర్ నగర్: పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను హుజూర్ నగర్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పోలీస్‌స్టేషన్‌(Huzur Nagar Police Station) పరిధిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఆరుగురు వ్యక్తులు బెట్టింగ్‌లు పెట్టుకొని మూడుముక్కలాట ఆడుతున్నారు.వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 4500- రూపాయల నగదుతో పాటు నాలుగు బైక్ లను,ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.పట్టణానికి చెందిన తోట కృష్ణమూర్తి, ములకలపల్లి రాము,నాయని లక్ష్మణ్ రావు,గజివెల్లి సీతారావు, ములకలపల్లి ఏడుకొండలు అలియాస్ కొండలు,తురక రమేష్ లను ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు తెలిపారు.ఈ దాడుల్లో హుజూర్ నగర్ ఏఎస్ఐ బలరాంరెడ్డి,సిబ్బంది సురేష్ కుమార్,నితిన్,వినోద్,శంభయ్య,పాల్గొన్నారు.