7 April, 2026 | 3:41 AM

తెలంగాణ X కేరళం

07-04-2026 01:42 AM

70 ఏళ్ల కేరళం ప్రస్థానాన్ని 28 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చడం సరికాదు 

కేరళం సీఎం విజయన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ 

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): తెలంగాణ, కేరళం ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగతున్న మాట ల యుద్ధం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కేరళం సీఎం పినరయ్ విజయన్ చేసి న ట్వీట్లకు కౌంటర్‌గా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరు పేజీల సుదర్ఘ లేఖ రాశారు. కేరళం అభివృద్ధి మోడల్‌లోని లో పాలను ఎత్తి చూపుతూనే.. తెలగాణలో గత 28 నెలల్లో సాధించిన ప్రగతిని లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 

పినరయ్ విజయన్ ఉటంకించిన గణాంకాలన్నీ 2023 24 నాటివని, అవి తెలంగాణలో గత ప్రభుత్వం (బీఆర్‌ఎస్) పాలన చివరి దశకు సంబంధించినవని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘మేం అధికారంలోకి వచ్చి 28 నెలలే అయింది. మీరు 120 నెలలుగా అధికారం లో ఉన్నారు. 70 ఏళ్ల కేరళం ప్రస్థానాన్ని మా 28 నెలలలో పోల్చడం తగదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కేవలం 28 నెల ల్లోనే ఎన్నో అద్భుత విజయాలు, అభివృద్ధిలో ప్రగతి సాధించామని, మరెన్నో పథ కాలు ప్రోగ్రెస్‌లో ఉన్నాయని తెలిపారు.

కేరళంలో శబరిమల బంగారు కుంభకోణాన్ని పినరయి విజయన్ సర్కారు సమర్థించడం గమనిస్తుంటే విజయన్ ప్రభుత్వ కపటత్వ వైఖరి స్పష్టంగా తెలుస్తుంది. సీఎంగా విజయన్ ఉన్నప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారాన్ని దోచుకున్నారని ఆరో పణలు ఉన్నాయి. దానిపై కేంద్ర విచారణ సంస్థలు ఎటువంటి విచారణ లేకపోవడం బీజేపీ, ఎల్డీఎఫ్ రహస్య సంబంధం ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్‌ను బీజేపీ ‘బీ-టీమ్’ అని విమర్శిస్తున్నారు. కానీ, విజయన్ ప్రభుత్వమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీ టీమ్‌గా వ్యవహరిస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.