24 July, 2026 | 11:12 PM

తెలంగాణ ఆచార వ్యవహారాలు ఉన్నతమైనవి

28-06-2024 12:17 AM

కామారెడ్డి, జూన్ 27(విజయక్రాంతి): తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు విశిష్టమైనవని, వాటిని చాటి చెప్పేందుకే జాతీయ సమైక్య శిబిరం నిర్వహిస్తున్నామని యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటేశ్వర్లు అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం 14 రాష్ట్రాలకు చెందిన 250 మందికిపైగా యువతీ యువకులతో నిర్వహించిన శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈనెల 30 వరకు శిబిరం కొనసాగిస్తున్నామన్నారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ యాదవ్‌రాజ్ మాట్లాడుతూ.. యువత రోజులో ఒక గంటను దేశం కోసం.. ఒక గంట ఆరోగ్య సంరక్షణకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి దామోదార్‌రెడ్డి, ప్రాజెక్ట్ సభ్యులు పాల్గొన్నారు.