14 April, 2026 | 12:20 AM

బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై స్పందించిన డీజీపీ

26-10-2024 03:48 PM

హైదరాబాద్: బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై తెలంగాణ డీజీపీ జితేందర్ శనివారం స్పందించారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందని చెప్పారు. సెలవులపై పాత పద్ధతినే అమలు చేస్తామన్నప్పటికీ ఆందోళన చేయడం సరికాదని సూచించారు. ఎంతో కాలం నుంచి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు.  తెలంగాణ రిక్రూట్ మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.