మంత్రి సీతక్కను కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్
19-09-2024 11:37 AM
హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రజా భవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య కమిషన్ చైర్మన్ గా నియమితులైన ఆకునూరి మురళికి శాలువా కప్పి మంత్రి సీతక్క అభినందించారు. ఈ సందర్బంగా తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవల్సిన చర్యలపై మంత్రి సీతక్క, ఆకునూరి మురళి చర్చించారు.




