20 June, 2026 | 2:41 AM

బీటెక్ విద్యార్థినికి తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆర్థిక సహాయం

20-06-2026 12:25 AM

ఆమనగల్లు, జూన్ 19 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, మాడుగుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని వడ్డమోని పావనికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసం చంపాపేట్ రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే కీలకమని, పావని ఉన్నత చదువులు చదివి అనుకున్న లక్ష్యాలనుసాధించాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, నాయకులు డొక్కా లింగం, హానుమండ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.