ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జూన్ 2(విజయక్రాంతి): గాంధీనగర్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు, ఉద్యమకారులకు, విద్యార్థులకు, ప్రతి తెలంగాణ బిడ్డకు నివాళులర్పించినట్లు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యరమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, సత్తి రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్ యాదవ్, ఆనంద్ రావు, సత్యేంధర్, నీరజ్, సంయుక్త రాణి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.






