3 June, 2026 | 1:06 AM

తెలంగాణకు బీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష

03-06-2026 12:32 AM

వంటేరు ప్రతాప్రెడ్డి

గజ్వేల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ ఎస్ పార్టీ జెండా, జాతీయ పతాకాలను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 2001లో కేసీఆర్ నా యకత్వంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్య మం ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా మారి ప్రత్యేక రాష్ట్ర సాధనకు దారితీసిందన్నారు.

మిలియన్ మార్చ్, ఆమరణ నిరాహార దీక్షలు వంటి ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, గురుకుల పాఠశాలలు, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మబాయి నర్సింగరావు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.