నగరంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
కరీంనగర్ క్రైం/ ముకరంపుర, జూన్ 2 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మంగళవారం నగరంలో ఘనం గా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సం స్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జాతీయ జెండాలను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు.
- డీసీసీ కార్యాలయంలో...
డీసీసీ కార్యాలయంలో జరిగిన వేడులకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరుకాగా జాతీయ పతాకాన్ని చొప్పదండి ఎ మ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మ ల్లేశం, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇం చార్జి వెలిచాల రాజేందర్రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమా ర్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
- బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో
జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ కుమార్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
- కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో
బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని పార్లమెంట్ కార్యాలయం రాష్ట్ర అ వతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృ ష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై సునీల్ రావు, రా ష్ట్ర నాయకులు బాస సత్యనారాయణ, గుగ్గిళ్ల రమేష్, ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి, మాడ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేష్, బండ రమణారెడ్డి, బండారి వేణు, చొప్పరి జయశ్రీ, నాంపల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మి మొండయ్య, భూపతి రవీందర్, నాయకులు గుజ్జ శ్రీనివాస్, కనుమల్ల గణపతి, పుప్పాల రఘు, వెస్ట్ జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి, దండు కొమురయ్య, అడిచెర్ల రాజు, పెర్క శ్రవణ్, సుధాకర్, ఆకుల రాజేందర్, కొప్పుల వారిప్రసాద్, వినుల్, వినీత్, మామిడి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
- అల్ఫోర్స్‌లో
అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై అమరవీరుల, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముకరంపుర, జూన్ 2(విజయ క్రాంతి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






