1 July, 2026 | 8:00 PM

Breaking News

సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •  

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

03-06-2025 12:28 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు(Telangana State Formation Day Celebrations) ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు జాతీయ జెండా నావిస్కరించి వేడుకలను నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోరాట ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వతో ముఖా అభివృద్ధి చెందిందాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి తిరోగమనలో ప్రయాణిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, సొసైటీ అధ్యక్షులు కురి నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు