14 July, 2026 | 7:16 PM

Breaking News

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •  

తెలంగాణలో 'దేవర' టికెట్ ధరల పెంపు..

23-09-2024 07:52 PM

హైదరాబాద్: సినీ ప్రియులకు సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ ఏన్టీఆర్ నటించిన 'దేవర' సిన్మా టికెట్ల ధరలను తెలంగాణలో పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటి గంట షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటి గంట షోలకు రూ. 100 టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం ఒకే చెప్పింది. మొదటి రోజు ఉదయం 4 నుంచి 6 గంటల షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి రోజు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధర రూ. 100 పెరగనుంది. ఈ నెల 28నుంచి అక్టోబర్ 6 వరకు 9 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు అమలులో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 25, మల్టీఫ్లెక్స్ లో రూ. 50 పెంచడాని అనుమతినిచ్చింది.