15 August, 2026 | 5:40 PM

రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేతగా కే. సురేశ్ రెడ్డి

17-06-2024 08:34 PM

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేతిరెడ్డి సురేశ్ రెడ్డి ఎంపికయ్యారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ పక్షనేతగా సురేశ్ రెడ్డిని సోమవారం నియమించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ, లోక్ సభ సెక్రటరీ జనరల్ లకు కేసీఆర్ లేఖలు రాశారు. అంతకుముందు వరకు ఆ స్థానంలో కె.కేశవరావు కొనసాగారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కే సురేష్‌రెడ్డి 2020 ఏప్రిల్‌లో రాజ్యసభకు నియామకమయ్యారు. ఆయన పదవీకాలం 2026 ఏప్రిల్‌ వరకు ఉన్నది. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్‌ఎస్‌కు కేశవరావుతో కలిసి ఐదుగురు ఎంపీలున్నారు. మిగితా వారిలో ఎంపీల్లో బీ. పార్థసారధి రెడ్డి, డీ. దామోదర్‌ రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌ రెడ్డి, ఉన్నారు.