18 July, 2026 | 1:37 PM

Breaking News

కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్‌   •   Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుంది: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

19-09-2025 08:14 PM

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 67వ జిల్లా పాఠశాల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... వలిగొండలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని గెలుపు, ఓటమి క్రీడల్లో సహజమని ప్రతి ఓటమి వెనుక గెలుపు ఉంటుందని  ఆయన అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఉల్లాసాన్ని కూడా అందజేస్తాయని అన్నారు. ఈ క్రీడోత్సవాలను తన తమ్ముడి జ్ఞాపకార్థం ఉపాధ్యాయుడు పసల విజయ్ ఆనంద్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు .