9 April, 2026 | 12:00 AM

మున్నూరుకాపు సంఘం తాలుక ఎన్నిక విజయవంతం చేయాలి

19-09-2025 08:17 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఈనెల 24 న బుధవారం జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం తాలుక కమిటీ ఎన్నిక ఉంటుందని ఆ సంఘం నాయకులు పొలంపల్లి గణపతి తెలిపారు. శుక్రవారం ఆ సంఘం నాయకులతో కలసి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈనెల 24న బుధవారం జిల్లాకేంద్రంలో ఆసిఫాబాద్ మండల యూత్ కమిటీ, తాలుక కమిటీల ఎన్నిక, జిల్లా హడక్ కమిటీ వేయడం జరుగుతుందని అన్నారు. నియోజక వర్గంలోని మున్నూరు కాపులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.