calender_icon.png 11 December, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1,204 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

11-12-2025 08:53:43 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana Gram Panchayat Elections) తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,204 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తొలివిడతలో 396, రెండో విడతలో 414, మూడో విడతలో 394 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం అయ్యారు. రాష్ట్రంలో 25,864 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడతలో 9,644, రెండో విడతలో 8,304, మూడో విడతలో 7,916  వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 21 గ్రామాలు, 368 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.