11-12-2025 08:32:00 AM
హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్(Panchayat elections) ఉదయం 7 గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 3,461 పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తులో సివిల్, ఆర్మ్ డ్ రిజర్వు, ఇతర స్పెషల్ పోలీసులు, విధుల్లో 50 వేల సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ బృందాలు, 2 వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది కౌంటింగ్ పూర్తయ్యే వరకు పూర్తిస్థాయి విధుల్లో ఉండనున్నారు. 54 అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేశారు. పోలింగ్ జరిగే గ్రామాల్లో నేడు స్థానికంగా సెలవు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్: 9240021456.