calender_icon.png 25 June, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు: హైకోర్టు ఆదేశం

25-06-2025 10:48:22 AM

హైదరాబాద్: తెలంగాణలోని గ్రామపంచాయతీలో(Gram Panchayat Elections) సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు(Telangana High Court) బుధవారం ఆదేశించింది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంగానికి హైకోర్టు ఆదేశించింది. గ్రామపంచాయతీ ఎన్నికలపై ఎన్నికలపై జస్టిస్ టి. మాధవిదేవి తీర్పు వెలువరించారు. సెప్టెంబర్ 30లోపు గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. తెలంగాణలో 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసింది. గడువు ముగిసిన ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై పిటిషన్ దాఖలు అయింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి.