3 August, 2026 | 2:17 PM

అవినీతి కేసులో తప్పించుకోలేరు

03-09-2025 12:00 AM

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏపి మిథున్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్ 

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి) : అవినీతి చేసి తప్పించుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏపి మిథున్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్‌లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉందని, కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం అన్నీ బయటకు వచ్చాయన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదికను సమర్పించరన్నారు. ఈ నివేదికలో చాలా స్పష్టంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి మంత్రులు, ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉన్నారన్నారు.

  ప్రజల డబ్బుతో చేసిన ఈ మోసాన్ని మేము వదిలిపెట్టమన్నారు. సిట్, సిబిఐ ద్వారా కాకుండా, పూర్తి నిష్పాక్షికత కోసం ఈ కేసును విచారణకు అప్పగించాలని మా ప్రభుత్వం ప్రజల పక్షన నిర్ణయించమన్నారు.   మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, సిరాజ్ ఖాద్రీ, బెనహర్ తదితరులు ఉన్నారు.