calender_icon.png 25 November, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో గీతన్న.. చలో సూర్యాపేట

25-11-2025 05:02:38 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 28న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల అంజయ్య గౌడ్ నకిరేకల్ మండల కార్యదర్శి గుడుగుంట్ల బుచ్చి రాములు గౌడ్, కట్టంగూరు మండల గౌరవ అధ్యక్షుడు చౌగాని లింగయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

మంగళవారం కట్టంగూర్ మండలంలోని చెర్వు అన్నారం గ్రామంలో, నకిరేకల్ మండలంలో నడిగూడెం గ్రామంలో ఆ సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికులకు పింఛన్ 4000 పెంచాలని, కార్మికులకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు పెంచాలని పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా డబ్బులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సేఫ్టీ మోకులు కార్మికులకు అందరికీ ఇవ్వాలని ప్రతి సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి తాటి ఈత వనం పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చెరువు అన్నారం మాజీ ఎంపీటీసీ కక్కిరేణి రామస్వామి, చౌగోని రాములు, చౌగొని సైదులు, కక్కిరేణి కనకయ్య, కక్కిరేణి వీరయ్య, కక్కిరేణి జానయ్య, కక్కిరేణి శంకర్, కక్కిరేణి కుమారస్వామి, కక్కిరేణి శివాజీ, చౌగోని సైదులు, భూపతి సదానందం, భూపతి నగేష్, గాజుల రామలింగయ్య, నడిగూడెం సొసైటీ సంఘం అధ్యక్షులు మాదా వెంకట్ గౌడ్ రాచకొండ లక్ష్మీపతి గౌడ్, నీలం వెంకన్న గౌడ్ నీలం రాంబాబు గౌడ్ రాచకొండ సత్తయ్య గౌడ్ రాచకొండ నాగభూషణం గౌడ్ రాచకొండ రాజేందర్ గౌడ్ మాద గోవర్ధన్ గౌడ్, మండల సహయ కార్యదర్శి పోలిశెట్టి వీర గౌడ్ తదితరులు పాల్గొన్నారు